అన్నవరం సత్యనారాయణ స్వామిని తుని ఎమ్మెల్యే యనమల దివ్య దంపతులు శనివారం ఉదయం దర్శించుకున్నారు. సత్యదేవుని సన్నిధిలో ఎమ్మెల్యే దివ్య తన భర్త గోపినాథ్‌తో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. సత్యదేవుని చిత్రపటం, స్వామి ప్రసాదం అందించారు.