ఐ. పోలవరం మండలం మురమళ్లలోని శ్రీ వీరేశ్వరస్వామి ఆలయంలో చండీహోమంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేశారు. అర్చకులు పేటేటి శ్యామకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.