ముమ్మిడివరం: ప్రజలను మోసం చేసారు: మాజీ ఎమ్మెల్యే
ముమ్మిడివరంలో శుక్రవారం జరిగిన వైసీపీ పోరుబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సాధ్యం కాని సూపర్ సిక్స్ హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలను పెంచమని హామీ ఇచ్చి ప్రజలపై రూ. 15, 480 కోట్ల విద్యుత్ భారం మోపారని ఇది దారుణం అని విమర్శించారు.