ధన్య చరితుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే దళిత చైతన్య వేదిక

83చూసినవారు
ధన్య చరితుడు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే దళిత చైతన్య వేదిక
సమాజంలోనున్న అసమానతలను రూపుమాపేందుకు తుదిశ్వాస వరకూ కఠోరంగా శ్రమించిన ధన్య చరితుడు మహాత్ముడు జ్యోతిరావు ఫూలేనని దళిత చైతన్య వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు రాజోలు పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక భవనం ఆవరణలో జ్యోతిరావు ఫూలే జయంతోత్సవ కార్యక్రమం గురువారం దళిత చైతన్య వేదిక ఉపాధ్యక్షుడు చిలకపాటి శ్రీధర్ అధ్యక్షతన సంఘ సభ్యులు నిర్వహించారు. తొలుత ఫూలే చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్