వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ స్థానికంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే వారు తమకు అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు ఇన్చార్జి ఎంపిడివో కేజే శ్రీనివాస చంద్ తెలిపారు. బుధవారం ఘంటసాలలో ఆయన మాట్లాడుతూ అనారోగ్య రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ ఐడి, ఆధార్ జిరాక్స్ కాపీలతో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.