రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ సాయం అందజేత

75చూసినవారు
రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ సాయం అందజేత
మోపిదేవి మండలంలోని కే. కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లో రేషన్ కార్డు కలిగిన వరద బాధితులకు ప్రభుత్వ సాయం శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొని బాధితులకు బియ్యం, పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్