24న కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు

78చూసినవారు
24న కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం ఎన్నికలు
కృష్ణా జిల్లా మత్స్య సహకార సంఘం నూతన పాలకవర్గం ఎన్నికకు సంబంధించి కలెక్టర్ డీకే. బాలాజీ నోటిఫికేషన్ జారీ చేసినట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 17వ తేదీన నామినేషన్ల స్వీకరణ, 18న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు ఇచ్చారని, 24వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్