బాణాసంచా దుకాణాల విషయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పెడనలో దీపావళి బాణాసంచా షాపులు ఏర్పాటు చేసే ప్రదేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు, ఇన్చార్జి తాసిల్దార్ అనిల్, మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తదితరులు పరిశీలించారు. షాపుల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.