నిద్రలో ఉన్నటువంటి ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసిన సంఘటన
ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు మండలం వెంగనాయకునిపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.