చెక్కపల్లిలో బాణాసంచా దుకాణంపై దాడి

79చూసినవారు
చెక్కపల్లిలో బాణాసంచా దుకాణంపై దాడి
ముసునూరు ఇంచార్జ్ ఎస్సై లక్ష్మణ్ బాబు ఆధ్వర్యంలో మండల పరిధిలోని చక్కపల్లి గ్రామంలో గల బాణాసంచా దుకాణంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్న సుమారు పదివేల రూపాయల విలువ గల బాణాసంచాను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ ఫణి భూషణ్ రావు తెలిపారు. అక్రమంగా నిల్వ చేసిన బాణాసంచా నిర్వాహకుడు గణపతిపై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్