స్థైర్యానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న వెనిగండ్ల రాము

21077చూసినవారు
స్థైర్యానంద స్వామి ఆశీస్సులు తీసుకున్న వెనిగండ్ల రాము
శ్రీ దయానంద సరస్వతి స్వామి వారి శిష్యులైన శ్రీ శ్రీ శ్రీ స్తైర్యానంద స్వామి వారి ఆశీస్సులను వెనిగండ్ల రాము, ఎంపీ వల్లభనేని బాలశౌరి తీసుకున్నారు. గుడివాడ పట్టణం ధనియాలపేట కాలనీలోని 115 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రణవాశ్రమాన్ని వారు ఇరువురు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులకు ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఆశ్రమ మొదటి పీఠాధిపతి శ్రీ ప్రణవానంద స్వామి వారు, రెండవ పీఠాధిపతి శ్రీ శ్రీ నిర్వికల్పానంద స్వామి వారు మానవాళి సుభిక్షత కోసం చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలను స్వామివారు వివరించారు. అలాగే గురువు శ్రీ దయానంద సరస్వతి స్వామివారు ప్రధాని నరేంద్ర మోడీకి కూడా గురువని తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా దయానంద సరస్వతి స్వామి వారి ఘనతలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్