యువతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో హోటల్ కు తీసుకెళ్లి ఆత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కొత్తపేట పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం కొత్తూరు తాడేపల్లికి చెందిన యువతి కి అదే ప్రాంతానికి చెందిన దుర్గాప్రసాద్ తో పరిచయం ఉంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గురువారం ఆ యువతిని హోటల్ రూమ్ కు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమంటే మొఖం చాటేశాడు.