

సీ. బెళగల్: వైభవంగా పోలకల్ జాతరలో ఎద్దుల పోటీలు
సీ. బెళగల్ మండలంలోని పోలకల్లో కొన్ని రోజులుగా శ్రీ చెన్న సోమేశ్వర స్వామి జాతర సందర్భంగా కర్నూలు జిల్లాలో వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం జాతరకి వచ్చిన ఎద్దులతో పోటీలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎద్దుల పోటీలను ఆసక్తిగా తిలకించారు. జిల్లాలో ఏ జాతర జరగనంత వైభవంగా ఈ జాతర జరుగుతుందని భక్తుల నమ్మకం.