జి. సింగవరం వద్ద ఆటో బోల్తా, ఒకరి మృతి

51చూసినవారు
జి. సింగవరం వద్ద ఆటో బోల్తా, ఒకరి మృతి
కర్నూలు మండలం జి. సింగవరం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రవీంద్ర (30) అనే వ్యక్తి మృతి చెందాడు. సి. బెళగల్ మండలం కొత్తకోటకు చెందిన 20 మంది దాకా కూలీలు టాటా ఏసీ వాహనంలో కర్నూలు వస్తున్నారు. సింగవరం సబ్ స్టేషన్ సమీపంలో డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా నడపడంతో ఆటో బోల్తా పడింది. రవీంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన వారందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్