Dec 11, 2024, 04:12 IST/
8 గంటలు ఫోన్ వాడకుండా.. ఛాలెంజ్లో రూ.లక్ష దక్కించుకున్న యువతి
Dec 11, 2024, 04:12 IST
చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలోని ఓ షాపింగ్ సెంటర్లో ఇటీవల పోటీ నిర్వహించారు. ఈ పోటీకి పది మందిని ఎంపిక చేశారు. పోటీలో పాల్గొన్నవారు ఫోన్ లేకుండా 8 గంటలు గడపాల్సి ఉంది. పోటీ జరుగుతున్నంత సేపూ బెడ్ మీదే ఉండాలి. కానీ నిద్ర పోకూడదు. ఆందోళనను ప్రదర్శించకూడదు. ఈ పోటీలో డాంగ్ అనే మహిళ 8 గంటల పాటు మొబైల్ ఫోన్కు దూరంగా ఉండి విజేతగా నిలిచింది. దీంతో రూ.1.16 లక్షల నగదు బహుమతి సొంతం చేసుకుంది.