ఆదోనిలోని శుక్రవారం పేటలో వెలసిన శ్రీజమ్మి మరద రామ లింగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి అంబల్ డాగీ ఈరన్న ధర్మపత్నిదివంగత సరోజమ్మ పేరిట కుటుంబ సభ్యులు రూ. 50 వేలు విరాళం అందించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు సోమవారం విలేకరులకు తెలిపారు. పరమ శివుని ఆశీస్సులు వారి కుటుంబంపై ఉండాలని పూజలు నిర్వహించారు. పురాతన దేవాలయాలను కాపాడుకోవడానికి ముందుకు రావాలన్నారు.