నీటి కుంటలో పడి బాలుడి మృతి

82చూసినవారు
నీటి కుంటలో పడి బాలుడి మృతి
హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామం లో మనోజ్ కుమార్(9) అనే బాలుడు ఆదివారం నీటి కుంటలో పడి మృతిచెందాడు. గ్రామం లోని వడ్డే మల్లికార్జున, మీనాక్షి దంపతులకు ముగ్గురు సంతానం. మూడో సంతానం మనోజ్ కుమార్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.