అసభ్య పదజాలంతో దూషించిన మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ ఆలూరు నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకుడు వెంకటేశ్ చౌదరి మంగళవారం ఆలూరు సీఐ శ్రీనివాస్ నాయక్ కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వరద బాధితులకు మంచి చేస్తున్న సీఎంపై లోఫర్ అంటూ అసభ్య పదజాలంతో దూషించడం మాధ్యమాల్లో చూశామన్నారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.