అవుకు పట్టణంలో అయ్యప్ప స్వామి దీక్షలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బుధవారం భక్తులు అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని ఊరేగింపులో పాల్గొన్నారు. స్వామివారి నామస్మరణతో దీపాలు వెలిగించి, నృత్యాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెట్టుపల్లె రోడ్డులోని అయ్యప్ప మందిరం నుంచి ప్రారంభమైన ఊరేగింపు అవుకు పురవీధుల మీదుగా అట్టహాసంగా సాగింది.