Dec 01, 2024, 02:12 IST/
ప్రభుత్వ అధికారులను బెదిరిస్తే క్రిమినల్ కేసులు!
Dec 01, 2024, 02:12 IST
ప్రభుత్వ అధికారులను బెదిరించినా, దాడులు చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. లగచర్ల, దిలావర్పూర్ ఘటనలతో పాటు సిరిసిల్ల కలెక్టర్‌పై కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫీసర్లపై దాడి చేసినా, బెదిరించినా రెండేళ్ల పాటు జైలుశిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.