ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకుంటాం: తహసీల్దారు

69చూసినవారు
ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకుంటాం: తహసీల్దారు
ప్యాపిలి పట్టణ సమీపంలోని సర్వే నెం896లోని నాయినిచెరువు ఆక్రమణకు గురైనట్లుగా గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దారు ప్రతాప్ రెడ్డి పేర్కొ న్నారు. రైతుల ఫిర్యాదు మేరకు ఆయన రెవెన్యూ సిబ్బందితో కలిసి చెరువును సోమవారం పరిశీలించారు. చెరువుకు సంబంధించిన భూమిలో సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. వెంచర్ యజమానికి నోటీసులు పంపుతామని తహసీల్దారు తెలిపారు.

సంబంధిత పోస్ట్