డోన్ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో రోగులు, గర్భిణులు వారి సహాయకులకు ఆదివారం పౌషికాహారం పంపిణీ చేశారు. కర్నూలు పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏసుదాసు ఆర్థిక సాయంతో రోగులకు రొట్టె, గుడ్డు, పప్పు పంపిణీ చేశామని ఆదరణ సంస్థ నిర్వాహకుడు జాన్ ప్రభాకర్ తెలిపారు.