నేటి నుంచి రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు

80చూసినవారు
నేటి నుంచి రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు
డోన్ పట్టణం కొండపేటలో వెలసిన రేణుకా ఎల్ల మాంబేశ్వరి అమ్మవారి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఏఈ నాగరాజుగౌడు అన్నారు. రేణుకా ఎల్లమ్మ ఆలయం ఉత్సవాకు ముస్తాబు చేశారు. సోమవారం అమ్మవారికి ప్రత్యేక ఆకుపూజలు, కుంకుమార్చనలు, అభిషేక కార్యక్రమాలు జరగనున్నట్లు ధర్మకర్త తెలిపారు. అలాగే అమ్మవారికి దోనాల సమర్పణ, అఖండ దీపజ్యోతుల ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్