కొత్తూరు సమీపంలో రోడ్డుపై లారీ దగ్ధం

8289చూసినవారు
కోడుమూరు మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ తో లారీ పూర్తిగా దగ్ధమైంది. బళ్ళారి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కేఏ 34 సి1872 నెంబర్ గల వాహనం షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న కోడుమూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోవడంతో రూ. 20 లక్షల దాకా నష్టం వాటిల్లిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్