కర్నూలు రూరల్ మండలం ఈ. తాండ్రపాడు గ్రామంలో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. గ్రామ సమీపాన పొలంలో గొర్రెల మందను నిలపగా వీధికుక్కలు దాడిచేసి జీవాలను పొట్టన బెట్టుకున్నాయని గురువారం యాజమాని కురువ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన జీవాల ఖరీదు రూ. 2 లక్షలు ఉంటుందని వాపోయారు. ఉమ్మడి జిల్లా గొర్రెల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసులు బాధితుడితో మాట్లాడి ఆర్థిక సాయం అందజేశారు.