ఈనెల 4న రాయలసీమ వర్సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు

83చూసినవారు
ఈనెల 4న రాయలసీమ వర్సిటీ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపు
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని రాయలసీమ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో జూన్ 4వ తేదీ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని, సహకరించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. శనివారం ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లను క్షేత్రస్థాయి అధికారులతో కలిసి జాతీయ రహదారులను పరిశీలించారు. ట్రాఫిక్ మళ్లింపును దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్