ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలి

569చూసినవారు
ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలి
అల్లా దయతో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని మత గురువు రెహమాన్ పవిత్ర రంజాన్ సందేశమిచ్చారు. గురువారం పెద్దకడబూరు మండలంలోని వివిధ గ్రామాలలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దకడబూరులో ముస్లీం సోదరులు రంజాన్ సందర్భంగా గ్రామ శివారుల్లోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువు రెహమాన్ మాట్లాడుతూ అల్లా గుణ గుణాలను ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలన్నారు. అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్