జ్ఞానాపురంలో పైపు పగిలి కొళాయినీరు రహదారిపైనే

67చూసినవారు
నంద్యాల పట్టణం జ్ఞానాపురం మంచినీటి ట్యాంకు సమీపంలో ఇళ్లకు సరఫరా చేసే మెయిన్ పైపు పగిలి నీరు రహదారి పైనే ప్రవహిస్తుంది. నీటి ట్యాంక్ సమీపంలోని మెయిన్ పైపు పగలడంతో ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీవాసులు వాటర్ వర్క్స్ అధికారులకు ఫోన్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. త్రాగునీరు రాక తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నామన్నారు. అధికా రులు చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్