
వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయండి: మాయావతి
దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టం గురించి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వ్యతిరేకించాయి. అయితే తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ చట్టంలోని నిబంధనలను మరోసారి పరిశీలించి, ప్రస్తుతానికి నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు. ఇక వక్ఫ్ సవరణ చట్టంపై ఏప్రిల్ 3న లోక్సభలో ఓటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు 288 మంది సభ్యులు ఓటేయగా.. 232 మంది వ్యతిరేకించారు.