రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా వారి ఆరాచకాలకు అడ్డు అదుపులేకుండా ఉందని, వారికన్నా పశువులు ఎంతో నయమని, మహిళల జోలికి వస్తే తాట తీస్తా అన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలుపుదామని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శుక్రవారం నంద్యాల బొమ్మలసత్రంలోని ఎంపీ బైరెడ్డి శబరి ఇంట్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు.