నంద్యాల పట్టణంలోని చెరుకట్ట వద్ద ఉన్న ఎస్ ఎస్ ట్యాంక్ వద్ద వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొప్పుల శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో న్యాయశాఖ మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ ఆదేశాల మేరకు చుట్టుపక్కల ఉన్న చెత్తాచెదారం, కంప చెట్లను గురువారం తొలగించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ కమిషనర్, ప్రేమ్నాద్ రెడ్డి, అడ్వకేట్ పురుషోత్తం తదితరులు కార్యక్రమం విజయవంతం చేశారు.