నంద్యాలలో కౌన్సిల్ తీర్మానం మంగళవారం వివాదంగా మారింది. నంద్యాల పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో ఎనభై అడుగుల రోడ్డును ముఫై అడుగులకు కుదిస్తూ వైసిపి కౌన్సిలర్లు కౌన్సిల్లో తీర్మానం చేశారు. కౌన్సిల్ తీర్మానం పై మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీఓ కాలనీలో మాస్టర్ ప్లాన్ 80 అడుగుల రోడ్డును 30 అడుగులు కుదించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదేమి వింత అని అధికారులను ప్రశ్నించారు.