ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

70చూసినవారు
నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు సమకూరుస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. గురువారం నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, సూపరింటెండెంట్ వరప్రసాద్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్