ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి స్వల్ప వరద ప్రవాహం నమోదైంది. జూరాల నుంచి 4, 052 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా. ప్రస్తుత నీటిమట్టం 809 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215. 807 టీఎంసీలు కాగా. ప్రస్తుత నీటినిల్వ 33. 7180 టీఎంసీలుగా ఉంది.