నల్లమల అటవీ సమీప గ్రామమైన ఆత్మకూరు మండలం ముస్టేపల్లి గ్రామంలో కుక్కల దాడిలో రెండు దుప్పులు మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి నల్లమల అటవీ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొరియడంతో బెదిరిన ఐదు దుప్పులు సమీప గ్రామమైన ముష్టేపల్లికి చేరుకున్నాయి. వీటిపై కుక్కలు దాడి చేయడంతో రెండు దుప్పులు మృతిచెందగా మరో మూడు దుప్పులు గాయాలతో అడవిలోకి పరుగులు తీసాయి.