ఎమ్మిగనూరులో వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ నాయకులు, బందే నవాజ్, ఇబ్రహీం, జాకీర్, రహంతుల్లా వారి అనుచరులు సుమారు 100 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.