ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న మహిళలకు ఇదొక గుడ్ న్యూస్. సూపర్ సిక్స్ స్కీమ్స్ ను ఒక్కొకటిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఈ ఫ్రీ బస్ పథకాన్ని సంక్రాంతి కానుకగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. పల్లె వెలుగుల వరకు అమలు చేయాలా.. లేక ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కూడా ఈ స్కీమ్ అమలు చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలలో అమలవుతున్నఈ స్కీమ్ గురించి ప్రభుత్వం అధ్యయనం చేసింది.