ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం జరుగుతోంది. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం కలెక్టర్ల సదస్సును ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ముందుగా నిర్ణయించినట్లు ఈ సదస్సు రెండు రోజులు కాకుండా ఒక్క రోజులోనే ముగించాలని నిర్ణయానికి వచ్చారు. మంత్రులు, ఆయా శాఖల ప్రత్యేక, ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొంటారు.