సోమిరెడ్డికి సవాల్ విసిరిన మంత్రి కాకాణి

58చూసినవారు
సోమిరెడ్డికి సవాల్ విసిరిన మంత్రి కాకాణి
టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి తనపై బురద చల్లుతున్నాడని, నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోమిరెడ్డి ఓటమి ఖాయమైందని.. అందుకే మాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మద్యం దొరికిన రైస్‌మిల్‌ ఓనర్‌కి, నాకు సంబంధం ఉందని నిరూపిస్తావా..? అని మంత్రి సవాల్‌ విసిరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you