షర్మిలను మిస్ అవుతున్నా: సీఎం జగన్

27437చూసినవారు
షర్మిలను మిస్ అవుతున్నా: సీఎం జగన్
ఓ ఇంటర్వ్యూలో సీఎం జగన్‌ను ‘మీ చెల్లి షర్మిలను మిస్ అవుతున్నారా?’ అని ప్రశ్న ఎదురైంది. దానికి సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కచ్చితంగా మిస్ అవుతున్నా. దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లింది. కానీ ప్రేమలు ఎక్కడకు పోతాయి?. చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తోంది. మా కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్‌లో చేరింది. మా కుటుంబ సభ్యురాలై ఉండి కూడా బయటకు వెళ్లడం, శత్రువులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోంది.’ అని అన్నారు.