ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. జనసేన నుంచి నాగబాబుకి కేబినెట్ బెర్త్ కన్‌ఫర్మ్ అయింది. ఇక ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం. జనవరిలో మంచి రోజు చూసుకొని నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని జనసేన పార్టీ ఆఫీస్ నుంచి టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.