ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలో గురువారం రాత్రి ఎస్ఐ వెంకటరెడ్డి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. రానున్న ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచామన్నారు.