నంద్యాల పట్టణంలో గురువారం నంద్యాల సి. యస్. ఐ చర్చ్ బిషప్ ప్యానల్ ఎన్నికలు జరిగాయి. సంతోష్ ప్రసన్నరావ్, ఐజక్ నందం, సాల్మన్, ఐజక్ ప్రసన్న లు బిషప్ ప్యానల్ కు అర్హతలు సాధించారు. సంతోష్ ప్రసన్న రావ్ అత్యధికంగా 224 ఓట్లు సాధించారు. త్వరలో చెన్నైలోని సి నాడ్ సంస్థ సభ్యులు ఈ నలుగురిలో ఒకరిని నంద్యాల డయాసిస్ బిషప్ గా ఎన్నుకుంటారు. సంతోష్ ప్రసన్నరావ్ కు బిషప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.