

పత్తికొండ: దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు
వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలోని మాదిగలపై కుల వివక్షతతో దాడి చేసిన నిందితులపై కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ వెల్దుర్తి పోలీసు స్టేషన్ శుక్రవారం బాధితులతో కలిసి ఫిర్యాదు చేశారు. రామళ్లకోటలో 13వ తేదీన ప్రసాద్, అనిల్ పై ఆదే గ్రామానికి చెందిన నలుగురు బీసీ వ్యక్తులు సీసీరోడ్డుపై ఏలా వస్తారంటూ దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.