నేడు చౌడేశ్వరీ అమ్మవారికి పల్లకి సేవ

563చూసినవారు
నేడు చౌడేశ్వరీ అమ్మవారికి పల్లకి సేవ
బనగానపల్లె మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నందవరం శ్రీచౌడేశ్వరి మాత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పల్లకి ఉత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లకి ఉత్సవం కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక అలంకరణ గావించి పల్లకిలో కొలువు తీర్చనున్నట్లు చెప్పారు. తదనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్