విజయవాడకు వెళ్లే వాహనాలను అడ్డుకున్న పోలీసులు

553చూసినవారు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వెళుతున్న టిడిపి శ్రేణుల వాహనాలను మంగళవారం ఆత్మకూరు పట్టణంలో పోలీసు అధికారులు నిలిపివేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణం ఇప్పటికే టిడిపి శ్రేణులతో నిండిపోవడంతో పోలీసులు ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. అయితే టిడిపి నాయకులు మాత్రం పోలీసుల సూచనలు పాటించడం లేదు.

సంబంధిత పోస్ట్