మర్రిపాడు మండల పరిధిలో మరో ప్రమాదం. నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై మర్రిపాడు పట్టణ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు నుంచి బద్వేల్ వెళ్లే మార్గంలో డివైడర్ వద్ద కారు యూటర్న్ తీసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఎవరికి ఏటువంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ కారు స్వల్పంగా దెబ్బతింది. మర్రిపాడు సమీపంలో వరుస ప్రమాదాలు జరగడంపై ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు.