ఆత్మకూరు నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆనం రామనారాయణరెడ్డి ని చేజర్ల మండలం ఎస్సై ప్రభాకర్ ఆదివారం ఆనం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనంకు ఎస్సై ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల అదుపులోకి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. చేజర్ల మండల ప్రజలకు ఏటువంటి కష్టం రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందని ఆయన అన్నారు.