కావలి రెవెన్యూ డివిజన్లో 86 చౌక ధరల దుకాణాల డీలర్ల ఖాళీలకు నోటిఫికేషన్ ను కావలి ఆర్డిఓ వంశీకృష్ణ గురువారం ప్రకటించారు. ఈనెల 10వ తేదీ దరఖాస్తుకు ఆఖరి తేదీ అని కావలి ఆర్డీవో కార్యాలయంలో మాత్రమే దరఖాస్తులు దాఖలు చేయాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులకు కావలి బాలుర ఉన్నత పాఠశాలలో 19వ తేదీ రాత పరీక్ష ఉంటుంది. దరఖాస్తుదారులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18 నుండి 40 సంవత్సరాల లోపు వారు అర్హులు.