శ్రీ ఆంజనేయ స్వామి సేవలో మాలేపాటి

78చూసినవారు
శ్రీ ఆంజనేయ స్వామి సేవలో మాలేపాటి
దగదర్తి మండలం, కాట్రాయపాడు గ్రామంలో వెలసియున్న మారుతి హనుమంతు ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, సింధూర పూజ, హోమం కార్యక్రమాలు జరిగాయి. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేశారు.

సంబంధిత పోస్ట్